చైతన్య మాష్టర్ కి 5 లక్షలు ఇచ్చా సినిమా కార్డు కోసం....
on Nov 11, 2025
.webp)
ఢీ 10 రాజు అంటే ఢీ షోలో ఫుల్ ఫేమస్ అలాంటి రాజు ఈ సీజన్ లో పండు, అభి మాష్టర్స్ తో పోటాపోటీగా డాన్స్ చేస్తున్నాడు. ఐతే ఒక ఇంటర్వ్యూలో తన కష్టాలను ఇలా చెప్పుకొచ్చాడు. "చైతన్య మాష్టర్ కి 5 లక్షలు ఇచ్చాను. ఆయన యూనియన్ లో ఇంకో మాష్టర్ కి ఇచ్చారు. నాకు కార్డు కోసం అని. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలీదు. ఇచ్చి కూడా నాలుగేళ్లు ఐపోయింది. నాకు ఇంకా కార్డ్ కూడా రాలేదు. ఆయన డబ్బులు ఎవరికీ ఇచ్చారో తెలీదు. కార్డు లేకుండా కోరియోగ్రఫీ చేయలేను. చాలా మూవీ ఆఫర్స్ వచ్చి వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు మూవీ కార్డు తీసుకోవాలంటే 6 లక్షలు కట్టాలి. నాకు ఆస్తులేమీ లేవు. అప్పట్లో రెండు ఇల్లు, అమ్మ వాళ్ళ ఊరిలో తోటలు ఉన్నాయి.
డాడీ మొత్తం అమ్మేశారు. నాకంటూ ఇప్పుడు ఏమీ లేదు. పేరు ఉంది కానీ డబ్బులు లేవు. ఫామిలీని నేనే చూసుకోవాలి కాబట్టి డబ్బులు ఎన్ని వచ్చినా ఐపోతున్నాయి. కార్డు వస్తుంది అని ఆశలు పెట్టుకున్నా. కానీ డబ్బుదేముంది ఇప్పుడు మనిషే పోయాడు కదా అని బాధగా ఉంది. అలాగే నా లైఫ్ లో ఇంకో కష్టం ఉంది. రెంట్ కోసం తిరుగుతున్నప్పుడు ఎక్కడికెళ్లినా డాన్సర్ అంటే రెంట్ కి ఇవ్వము అని చెప్పేవాళ్ళు. దాంతో నాకు కోపం వచ్చి డైరెక్ట్ విల్లా దగ్గరకు వెళ్లి రెంట్ అడిగితె నెలకు 60 వేలు అన్నారు. ఎం చేస్తావని అడిగితె డాన్సర్ అని చెప్పాను. ఐతే సాఫ్ట్ వేర్ వాళ్లకు తప్ప డాన్సర్స్ కి ఇవ్వము అని చెప్పారు. 70 వేలైనా రెంట్ ఇస్తాను అన్నాను. కానీ ఇవ్వము అని చెప్పారు. త్వరలో సొంత ఇల్లు ఎలాగైనా కొనుక్కోవాలి" అని చెప్పాడు ఢీ 10 రాజు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



